Pakistan: ఎఫ్ 16 పైకి ఆర్ - 73 క్షిపణిని ప్రయోగించిన అభినందన్!

  • భారత్ భూభాగంలోకి చొరబడ్డ 24 యుద్ధ విమానాలు
  • వాటిలో 8 ఎఫ్-16, 4 మిరాజ్-3, 4 జేఎఫ్-17
  • మిగ్ 21కు పైలెట్‌గా అభినందన్
  • 2 ఏఎంఆర్ఏఏఎం క్షిపణులను ప్రయోగించిన పాక్

నిన్న సరిహద్దులలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకురావడం.. వాటిని భారత్ వీరోచితంగా తిప్పికొట్టడం.. ఈ క్రమంలోనే అభినందన్ వర్థమాన్ పాక్ చేతికి బందీ అవడానికి సంబంధించిన వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. నిన్న ఉదయం 9:45 గంటలకు ఒక్కసారిగా మొత్తం 24 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి భారత్ భూభాగంలోకి చొరబడ్డాయి. వీటిలో ఎనిమిది ఎఫ్-16, నాలుగు మిరాజ్-3, నాలుగు జేఎఫ్-17 ఉన్నాయి. వీటికి రక్షణగా కొన్ని విమానాలు నియంత్రణ రేఖకు అవతల వైపు సిద్ధంగా ఉన్నాయి. వీటిని గుర్తించిన భారత వైమానిక దళం.. నాలుగు సుఖోయ్ 30, రెండు మిగ్ 21 బైసన్, రెండు మిరాజ్ 2000 విమానాలతో అడ్డుకున్నాయి.

మిగ్ 21కు చెందిన రెండు విమానాల్లో ఒకదానికి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పైలెట్‌గా ఉన్నారు. ఆయన ఎఫ్ 16 పైకి ఆర్ - 73 క్షిపణిని ప్రయోగించగా.. పాక్ ఎఫ్ - 16 కూడా రెండు ఏఎంఆర్ఏఏఎం క్షిపణులను ప్రయోగించడంతో వాటిల్లో ఒకటి అభినందన్ విమానాన్ని తాకింది. దీంతో ఎఫ్ 16 పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో కూలిపోగా.. రెండు విమానాల్లోని పైలెట్లు నియంత్రణ రేఖకు అవతల దిగారు. ఆ తరువాత అభినందన్‌ను పాక్ తమ చెరలోకి తీసుకోవడం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే వీరిలో పాక్ ఎఫ్ 16 పైలెట్ల విషయం మాత్రం ఇప్పటి వరకూ సస్పెన్స్‌గానే ఉంది.

More Telugu News