india: పాకిస్థాన్ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దు: ప్రధాని మోదీ

  • భారత సైన్యానికి అందరూ మద్దతుగా నిలవాలి
  • భారత శక్తిని ఎవరూ ఆపలేరు
  • మన నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయాలని పాక్  యత్నం
పాకిస్థాన్ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దని, పాక్ కుట్రలను బహిర్గతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘మేరా బూత్ సబ్ సే మజ్ బూత్’ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలతో మోదీ ఈరోజు ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

 ‘నమో’ యాప్ ద్వారా దాదాపు పదిహేను వేల లొకేషన్స్ నుంచి మోదీ ప్రసంగాన్ని బీజేపీ కార్యకర్తలు వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. భారత సైన్యానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. మన నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయాలని పాక్ యత్నిస్నోందని, భారత శక్తిని ఎవరూ ఆపలేరని దీమా వ్యక్తం చేశారు. మన సైనికులు సరిహద్దుల్లో, సరిహద్దు అవతల కూడా తమ పరాక్రమాన్ని చూపించారని కొనియాడారు. భారత్ ఒక్కటిగా జీవిస్తుంది, ఒక్కటిగా పోరాడుతుందని అన్నారు. 
india
Pakistan
mera buth subse mazbuth
modi

More Telugu News