india: భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధంపై పవన్ స్పందన

  • ఇరు దేశాల మధ్య సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు
  • యుద్ధం జరిగితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయి
  • అభినందన్ క్షేమంగా తిరిగిరావాలి

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. యుద్ధం జరిగితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయని తెలిపారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు బలికావడం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆర్మీకి భారత పైలట్ చిక్కడం కలవరానికి గురి చేస్తోందని చెప్పారు. జెనీవా ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉండాలని సూచించారు. పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News