Andhra Pradesh: జగన్ ఇంటికి వెళ్లిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. పలు అంశాలపై చర్చలు!

  • లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన విజయసాయిరెడ్డి
  • వైసీపీ అధినేతతో పలు అంశాలపై చర్చలు
  • రాజకీయాలు మాట్లాడలేదన్న యార్లగడ్డ
ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు వైసీపీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి యార్లగడ్డను లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో ఆయన పలు అంశాలపై ముచ్చటించారు. ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డి(సినారె)పై తాను రాసిన పుస్తకాన్ని జగన్ కు ఆయన అందజేశారు.

అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డిపై రాసిన పుస్తకాన్ని జగన్ కు అందించేందుకే తాను వచ్చానని తెలిపారు. ఈ భేటీలో రాజకీయాలపై ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. యార్లగడ్డ ప్రస్తుతం ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Hyderabad
yarla gadda lakshmi prasad
Vijay Sai Reddy

More Telugu News