kaushal: నాపై కుట్ర చేసి గెలిచిన తనీష్ ను అభినందిస్తున్నాను: 'బిగ్ బాస్' కౌశల్

  • తనీష్ అప్పుడు ఛాలెంజ్ చేశాడు
  • నా వ్యతిరేకులను కూడగట్టాడు
  •  తనీష్ నిజంగానే చాలా గ్రేట్    

'బిగ్ బాస్' సీజన్ 2లో కౌశల్ విజేతగా నిలిచాడు. ఈ రియాలిటీ షో కారణంగా ఆయన చాలా పాప్యులర్ అయ్యాడు. అయితే ఆయన విజయంలో ప్రధాన పాత్రను పోషించిన కౌశల్ ఆర్మీ ఇప్పుడు ఆయనకే రివర్స్ అయింది. కౌశల్ పై అనేక ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కింది.

దాంతో కౌశల్ కూడా తాజాగా తనదైన శైలిలో స్పందిస్తూ .. "నేను 'బిగ్ బాస్' హౌస్ లో వున్నప్పుడే 'కౌశల్ .. బయటికి రా .. నేనేంటో చూపిస్తాను'అని తనీష్ ఛాలెంజ్ చేశాడు. 'బిగ్ బాస్' హౌస్ లో అన్నది ఇప్పుడు చేస్తున్నాడు. నాతో సినిమా చేస్తానన్నవారికి ఫోన్ చేసి, ఆ సినిమా లేకుండా చేశాడు. నాకు వ్యతిరేకంగా వున్నవారిని కూడగట్టుకుని, నన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు. తనీష్ నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి .. ఎందుకంటే కుట్రలు చేసి నాపై గెలిచాడు .. అందుకు నేను ఆయనను అభినందిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News