సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయిన 13 రోజులకే.. భార్యకు అత్తింటిలో వేధింపులు.. మరిదిని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి!
- కర్ణాటకలోని మాండ్యాలో ఘటన
- ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హెచ్.గురు
- కోడలికి అందే నష్టపరిహారంపై అత్తింటివారి కన్ను
మాండ్యాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ హెచ్.గురు ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. ఈ ఘటన అనంతరం పలువురు వ్యక్తులు సీఆర్పీఎఫ్ జవాన్లకు సాయం ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందనుంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం నగదు దక్కించుకునేందుకు వీలుగా గురు కుటుంబ సభ్యులు పావులు కదిపారు.
మరిదిని పెళ్లి చేసుకోవాలని గురు భార్య కళావతి(25)పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి వేధింపులు హద్దుదాటడంతో ఆమె మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కళావతికి ఉద్యోగం కల్పించాలని సంబంధిత అధికారులను కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు.