'దండుపాళ్యం' సినిమా చూసి... 14 రేప్ లు, 4 హత్యలు... పశ్చిమ గోదావరి జిల్లాలో కామ పిశాచి!
- శ్రీధరణి హత్య కేసును విచారించిన పోలీసులు
- నమ్మలేని నిజాల వెలికితీత
- కన్ను పడితే అత్యాచారం చేసే రాజు
- కఠిన శిక్ష పడేలా చూస్తామన్న పోలీసులు
కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకుని, జీ కొత్తపల్లికి మకాం మార్చాడని తెలిపిన పోలీసులు, జీడితోటలకు కాపలాకాస్తూ, పక్షులు, జంతువులను వెంటాడుతూ తిరుగుతుంటాడని, తనకు తారసపడ్డ ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు గుంజుతాడని, తనకు నచ్చితే, యువకుడిని చావగొట్టి, ఆమెపై అత్యాచారం చేస్తాడని, ఆ సమయంలో ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోబోడని తెలిపారు. చంపుతానని బెదిరించి అత్యాచారం చేస్తాడని, ఎవరైనా ఎదురు తిరిగి సహకరించకుంటే దారుణంగా హతమారుస్తాడని చెప్పారు. రాజుకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.