India: ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. విద్యా సంస్థలను మూసివేయాలి: సరిహద్దులో హై అలెర్ట్

  • భయంతో ఇతర ప్రాంతాలకు ప్రజలు
  • నియంత్రణ రేఖను దాటి దాడి చేయాలన్న పాక్
  • యుద్ధ విమానాలను తరిమికొట్టాలన్న భారత్

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలు కొందరు ఇప్పటికే భయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఆత్మ రక్షణ కోసం తమ విమానాలు నియంత్రణ రేఖను దాటి కూడా దాడి చేస్తాయని పాకిస్థాన్ ప్రకటన చేసింది. పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టాలని భారత్ ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో సరిహద్దు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ, బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించాయి.

ఎల్‌వోసీకి ఐదు కిలోమీటర్ల దూరంలోపు రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఉండే విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. గతరాత్రి పాక్ కాల్పులకు తెగబడటం.. ఎల్‌వోసీని దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News