India: ‘పాక్’ కు పట్టుబడ్డ భారత్ పైలెట్ అభినందన్ స్వస్థలం కేరళ

  • తాంబరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందిన పైలెట్ 
  • ప్రస్తుతం పంజాబ్ లో నివసిస్తున్న అతని కుటుంబం
  • అభినందన్ తండ్రి వర్థమాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్

భారత్ కు చెందిన ఐఏఎఫ్ పైలెట్ విక్రమ్ అభినందన్ ని సజీవంగా పట్టుకున్నామని పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని కొంతవరకు ధ్రువీకరిస్తూ, తమ పైలెట్ ఆచూకీ తెలియడం లేదని భారత్ పేర్కొంది. కాగా, మిగ్-21 విమానం కూలిపోవడంతో ప్యారాచూట్ ద్వారా తప్పించుకునే యత్నం చేసిన అభినందన్, పాక్ ఆర్మీకి పట్టుబడ్డాడు. తమ భూభాగంలో పడిపోయిన అభినందన్ ను పాక్ సైనికులు దారుణంగా కొడుతూ తమ అధీనంలోకి తీసుకున్నారు. యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్టయింది.

విక్రమ్ అభినందన్ స్వస్థలం కేరళ. అభినందన్ తండ్రి వర్థమాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్. అభినందన్ విద్యాభ్యాసం తిరుప్పూర్ జిల్లాలో సాగింది. చెన్నై తాంబరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. అభినందన్ కుటుంబం ప్రస్తుతం పంజాబ్ లో నివసిస్తున్నట్టు సమాచారం.

More Telugu News