Pakistan: పాకిస్థానీ ఖైదీలను హై సెక్యూరిటీ సెల్స్ కు తరలించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం

  • ఇటీవల జైపూర్ జైల్లో పాక్ ఖైదీని కొట్టి చంపిన తోటి ఖైదీలు
  • ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మమత సర్కారు నిర్ణయం
  • పాక్ ఖైదీలకు మూడంచెల భద్రత

భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో 14 మంది పాకిస్థానీ ఖైదాలను హై సెక్యూరిటీ సెల్స్ కు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరలించింది. జైపూర్ సెంట్రల్ జైల్లో 50 ఏళ్ల పాక్ ఖైదీని తోటి ఖైదీలు కొట్టి చంపిన రోజుల వ్యవధిలో మమత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంది.

జైపూర్ సెంట్రల్ జైలు ఘటన నేపథ్యంలో, పాకిస్థాన్ ఖైదీలను ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశామని ఓ అధికారి తెలిపారు. పాక్ ఖైదీలకు మూడంచెల భద్రతను కల్పించామని చెప్పారు. వాస్తవానికి తోటి ఖైదీలతో పాక్ ఖైదీలు స్నేహపూర్వకంగానే ఉన్నారని... అయితే, పుల్వామా ఘటన నేపథ్యంలో రిస్క్ తీసుకోదలచుకోలేదని అన్నారు. పాక్ ఖైదీలు ఉన్న సెల్స్ పై జైలు అధికారులు నిరంతర నిఘా ఉంచుతారని చెప్పారు.

More Telugu News