India: భారత్-పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చు: పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్

  • రాగల 72 గంటలు అత్యంత కీలకం
  • యుద్ధమా? శాంతా? అనేది తేలిపోతుంది
  • యుద్ధమొస్తే అది రెండో ప్రపంచ యుద్ధం కన్నా పెద్దదిగా ఉంటుంది
భారత్-పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చని పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రషీద్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాగల 72 గంటలు అత్యంత కీలకమని, యుద్ధమా? శాంతా? అనేది తేలిపోతుందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే, అది రెండో ప్రపంచయుద్ధం కన్నా పెద్దదిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  
India
Pakistan
railway minister
sheik rasheed

More Telugu News