Pakistan: భారత్‌ పైలెట్‌ను అదుపులోకి తీసుకున్నాం : పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధి ప్రకటన

  • రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామంటున్న దాయాది దేశం
  • ఒకటి మా భూభాగంలో, మరొకటి భారత్‌ భూభాగంలో కూలాయి
  • నియంత్రణరేఖ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణ
నియంత్రణ రేఖ వద్ద  నిబంధనలు ఉల్లంఘించి తమ భూభాగంలోకి ప్రవేశించిన రెండు భారత్‌ యుద్ధ విమానాలను కూల్చివేశామని, అందులో ఒక విమానం పైలెట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్‌ ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని బుద్గాంలో నేడు ఓ యుద్ధ విమానం కూలి ఇద్దరు పైలెట్లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే కూలినవి ఒకటి కాదని, రెండు విమానాలని, ఒకటి భారత్‌ భూభాగంలో, మరొకటి తమ భూభాగంలో కూలిపోయాయని పాకిస్థాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆపీఫ్‌ గపూర్‌ ట్వీట్‌ చేశారు. యుద్ధ విమానాలు కూలిన ఘటనపై భారత్‌ అధికారులు విచారణకు ఆదేశించారు.
Pakistan
fighter jets
two down
pailot in pakistan hands

More Telugu News