brahmanadam: మళ్లీ సెట్స్ పైకి రానున్న బ్రహ్మానందం

  • హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న బ్రహ్మానందం
  • కొన్ని రోజులుగా పూర్తి విశ్రాంతి
  •  వచ్చే నెల నుంచి మళ్లీ రంగంలోకి  

తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు పెట్టించిన బ్రహ్మానందం, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అలాంటి బ్రహ్మానందం .. ఇటీవలే హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే బ్రహ్మానందం ఇలా అస్వస్థతకి లోను కావడం ఆయన అభిమానులందరినీ ఆందోళనకి గురిచేసింది. ఆయన కోలుకుంటున్నారని తెలిశాక వాళ్లందరి మనసులు కుదుటపడ్డాయి. అయితే మళ్లీ ఆయన నటిస్తారా .. లేదా అనే సందేహం మాత్రం వాళ్లను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి బ్రహ్మానందం సిద్ధమవుతున్నారట. ముందుగానే కొన్ని సినిమాలను కమిట్ అయిన ఆయన, వాటి షూటింగ్ నిమిత్తం వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

More Telugu News