amaravathi: అందుకే, ప్రధాని మోదీకి మనమంటే భయం: సీఎం చంద్రబాబు

  • గుజరాత్ ని మించిపోతామని భయం
  • అందుకే, మన మొఖాన మట్టీనీళ్లు కొట్టిపోయారు
  • ఏపీ మట్టి, నీళ్లకు ఉన్న మహిమ ఎలాంటిదో చూపిస్తాం
అభివృద్ధి విషయంలో మనం గుజరాత్ ని మించిపోతామని ప్రధాని మోదీకి మనమంటే భయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. అందుకే, మన మొఖాన మట్టీనీళ్లు కొట్టిపోయారని ధ్వజమెత్తారు. నాడు సైబరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని, అహ్మదాబాద్ కు, హైదరాబాద్ కు ఏమైనా పోలిక ఉందా? అని ప్రశ్నించారు. ఏపీ మట్టి, నీళ్లకు ఉన్న మహిమ ఎలాంటిదో చూపిస్తామని, అమరావతికి స్థాన బలం, ఈ ప్రాంతానికి శక్తి ఉందని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కంటే ఏపీ ముందుందని అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలను స్వయంకృషితో అధిగమిస్తున్నామని చెప్పారు. విమర్శకుల నోళ్లు మూతపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం తాను ఒక్క పిలుపు ఇవ్వగానే ఇక్కడి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అదే, జగన్ అడిగితే రైతులు ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు.
amaravathi
Chandrababu
Hyderabad
ahammadabad

More Telugu News