Chandrababu: మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తున్నాం: చంద్రబాబు, జగన్

  • ఉగ్రవాదుల భరతం పట్టిన వాయుసేనకు జేజేలు పలుకుదామన్న చంద్రబాబు
  • వాయుసేనకు, పైలట్లకు శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • మిమ్మల్ని చూసి గర్విస్తున్నామన్న ప్రతిపక్ష నేత
పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రతండాలపై భారత వాయుసేన దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం. ఈ దాడిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లు స్పందించారు.

ఉగ్రవాదుల భరతం పట్టిన భారత వాయుసేన శక్తికి జేజేలు పలుకుదామని చంద్రబాబు అన్నారు. భారత వాయుసేనకు, అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించిన పైలట్లకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన మిమ్మల్ని చూసి మేమంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు.
Chandrababu
jagan
Telugudesam
ysrcp
air force
strikes
Pakistan

More Telugu News