Surgicle Strikes: చైనాకు ఫోన్ చేసిన పాకిస్థాన్... సాయం చేయాలని వినతి... అంగీకరించని చైనా!

  • సర్జికల్ స్ట్రయిక్స్ తో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్
  • వాంగ్ వీతో ఫోన్ లో మాట్లాడిన మఖ్దూమ్ షా
  • ఇండియాపై ఫిర్యాదు
భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ వెంటనే చైనాను సంప్రదించింది. వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ 'క్సిన్హువా' స్వయంగా వెల్లడించింది.

భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్ లోకి ప్రవేశించిందని చైనాకు ఫిర్యాదు చేసిన పాక్ మంత్రి, తిరిగి దాడులు చేసేందుకు సహకరించాలని కోరగా, చైనా అందుకు అంగీకరించలేదని సమాచారం. భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు, వాటిని తరిమేశాయని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
Surgicle Strikes
Pakistan
China
Phone Call

More Telugu News