subrahmanian swamy: వెయ్యి గాయాలు చేస్తామన్నారు... వెయ్యి బాంబులతో సమాధానమిచ్చాం: సుబ్రహ్మణ్యస్వామి

  • పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే.. మన భూభాగంపై మనం బాంబులు వేయడంలో తప్పులేదు
  • దేశ రక్షణ కోసం పాకిస్థాన్ ప్రధాన భూభాగంపై కూడా దాడి చేయవచ్చు
  • ఐక్యరాజ్యసమితి చార్టర్ లో ఇది క్లియర్ గా ఉంది
పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. మన వాయుసేన జరిపిన దాడుల్లో ఎక్కువ భాగం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే జరిగాయని... ఆ భూభాగమంతా భారత్ దేనని... మన భూభాగంపై మనం బాంబులు వేయడంలో చింతించాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. ఒకవేళ దాడులు జరిగిన ప్రాంతం పాకిస్థాన్ ప్రధాన భూభాగమైనా... ఐక్యరాజ్యసమితి చార్టర్ లో పేర్కొన్న విధంగా దేశ రక్షణ కోసం పాక్ ప్రధాన భూభాగంపై దాడులు చేయడంలో తప్పులేదని అన్నారు. మనపై ఎంతో కాలంగా పాకిస్థాన్ దాడులకు తెగబడుతోందని చెప్పారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ చెప్పిందని... వెయ్యి బాంబులను వారికి ఇవ్వడం ద్వారా (బాంబులు వేయడం) మన ప్రభుత్వం సరైన పని చేసిందని అన్నారు.
subrahmanian swamy
bjp
Pakistan
loc
pok
air strikes
airforce

More Telugu News