sekhar master: ప్రభుదేవాను చూసే నేను డాన్స్ నేర్చుకున్నాను: శేఖర్ మాస్టర్

  • ప్రభుదేవాను స్ఫూర్తిగా తీసుకున్నాను
  • ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే
  • నన్ను పిలిచి మరీ అభినందించారు

 చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. ఎన్టీఆర్ .. చరణ్ .. ఇలా స్టార్ హీరోల సినిమాలకి నృత్య దర్శకుడిగా శేఖర్ మాస్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ ఛానల్స్ లో డాన్స్ కాన్సెప్ట్ తో సాగే షోల్లోను జడ్జిగా వ్యవహరిస్తూ ఆయన బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. అలాంటి శేఖర్ మాస్టర్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"మొదటి నుంచి కూడా నాకు ప్రభుదేవా అంటే ఇష్టం. ఆయనని స్ఫూర్తిగా తీసుకోవడం వల్లనే ఈ రోజున ఇక్కడ వున్నాను. ఆయన ఒక హీరోగా చేసిన 'కళ్యాణ రాముడు' సినిమాలో నేను ఒక డాన్సర్ గా కనిపించాను. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. 'ఇద్దరమ్మాయిలతో' .. 'బాద్ షా' సినిమాలకి గాను చేసిన కొరియోగ్రఫీని ప్రభుదేవా గారు చూసి, ఎవరు చేసిందీ తెలుసుకోమని మేనేజర్ తో చెప్పారట. ఆయన ప్రభుదేవాగారికి నా పేరు చెప్పాడు. దాంతో ప్రభుదేవాగారు నన్ను పిలిపించి అభినందించారు. హిందీ సినిమా 'యాక్షన్ జాక్సన్'లో నాకు అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News