jash e mohammed: జైషే మొహమ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ను ధ్వంసం చేసిన భారత వాయుసేన... ఎక్స్ క్లూజివ్ వీడియో చూడండి

  • మోదీ ఆదేశాలతో విరుచుకుపడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్
  • సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న దాదాపు డజను యుద్ధ విమానాలు
  • ఒప్పందాలకు భారత్ తూట్లు పొడిచిందంటూ పాక్ గగ్గోలు
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో మన వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ పై మన యుద్ధ విమానాలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. దాదాపు 12 మిరేజ్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.

వెయ్యి కిలోల బాంబులను నియంత్రణరేఖ వద్ద ఉన్న ఉగ్ర తండాలపై మన వాయుసేన జారవిడిచింది. బాలాకోట్, చకోతీ, ముజఫరాబాద్ లలోని లాంచ్ ప్యాడ్స్ తో పాటు జైషే మొహమ్మద్ కు చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ను వాయుసేన ధ్వంసం చేసింది. మన వాయుసేన బాంబులను జారవిడుస్తున్న దృశ్యాలు కిందున్న వీడియోలో ఉన్నాయి. మరోవైపు, నియంత్రణరేఖకు సంబంధించిన ఒప్పందాలకు భారత్ తూట్లు పొడిచిందని పాకిస్థాన్ మండిపడుతోంది.
jash e mohammed
indian air force
miraze
loc
surgical strikes
Pakistan

More Telugu News