Pakistan: ఎల్ఓసీ వద్ద యుద్ధ వాతావరణం... విమాన విధ్వంసక క్షిపణుల తరలింపు!

  • సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాల కదలిక
  • గుర్తించిన ఇంటెలిజెన్స్
  • ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ

ఈ తెల్లవారుజామున భారత వాయుసేన యుద్ధ విమానాలు సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన తరువాత, వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాల కదలికలను గుర్తించిన భారత వాయుసేన, హుటాహుటిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సిద్ధం చేస్తోంది.

పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ భారత భూభాగంలోకి ప్రవేశిస్తే, వాటిని వెంటనే నేలమట్టం చేసేందుకు విమాన విధ్వంసక క్షిపణులను సరిహద్దుల వెంబడి మోహరిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ఈ క్షిపణులు చేరుకున్నాయి. నిన్న సాయంత్రం లక్షిత దాడులకు గ్రీన్ సిగ్నల్ రాగానే, సరిహద్దుల్లో ఉన్న భద్రతా జవాన్లను అప్రమత్తం చేసి, అదనపు విమానాలను, క్షిపణులను మోహరించే పని ప్రారంభించారు. దీంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళనలలో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే పని ప్రారంభమైంది.

More Telugu News