Pakistan: పాక్ ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ... 300 మంది ఉగ్రవాదుల హతం!

  • 200కు పైగా బాంబులు వేసిన యుద్ధ విమానాలు
  • 3 కంట్రోల్ యూనిట్లు ధ్వంసం
  • ఎల్ఓసీని విమానాలు దాటగానే తరిమేశామన్న పాక్
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై కోలుకోలేని దెబ్బ పడింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అందరూ నిద్రిస్తున్న వేళ, చడీ చప్పుడు కాకుండా వెళ్లిన భారత యుద్ధ విమానాలు జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ లో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రధాన పట్టణాలైన బాలాకోట్, ముజఫరాబాద్ శివార్లలో ఉన్న శిబిరాల్లోని 3 కంట్రోల్ యూనిట్లపై 200కు పైగా బాంబులను జారవిడిచిన వాయుసేన విమానాలు, ఆ ప్రాంతాన్ని తునాతునకలు చేసి వచ్చాయి. దీనిపై స్పందించిన పాకిస్థాన్, భారత యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చాయని, దీన్ని గమనించిన తమ ఫైటల్ జెట్స్ వాటిని తరిమేశాయని ప్రకటించింది.
Pakistan
India
Terrorists
Surgicle Strikes

More Telugu News