Jammu And Kashmir: పాక్ కండకావరం.. కశ్మీర్ భారత్‌లో భాగం కాదట.. ఇంకెప్పుడూ కాబోదట: పాక్ మంత్రి

  • పాడిందే పాడిన పాక్
  • కశ్మీరీలపై దాడులు ఆపాలని హితవు
  • ఇతర రాష్ట్రాలతో సమానంగా కశ్మీరీలకు హక్కులు ఇవ్వాలని డిమాండ్

భారత్‌పై తనకున్న అక్కసును పాకిస్థాన్ మరోమారు వెళ్లగక్కింది. పాడిందే పాడరా అన్నట్టు.. భారతదేశంలో కశ్మీర్ భాగం కాదని, ఇంకెప్పుడూ కాబోదని కండకావరం ప్రదర్శించింది. పుల్వామా దాడి తర్వాత భారత్‌పైనే నిందలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పాక్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.

సోమవారం ఆ దేశ ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. భారత్‌లో కశ్మీర్ భాగం కాదని, ఇంకెప్పటికీ కాబోదని తేల్చి చెప్పారు. అంతేకాదు, కశ్మీర్‌లో ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ఆపాలని, ఇతర రాష్ట్రాలతో సమానంగా కశ్మీరీ ప్రజలకు సమాన హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్‌తో సంబంధాలనే పాక్ కోరుకుంటోందన్న ఆయన పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News