sekhar master: చిరంజీవిగారిని దగ్గర నుంచి చూస్తానని కూడా అనుకోలేదు: శేఖర్ మాస్టర్

  • చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం
  •  చిరంజీవి గారంటే ఎంతో అభిమానం
  •  వినాయక్ - చరణ్ కలిసి ఛాన్స్ ఇచ్చారు    
తెలుగులో ఇప్పుడు చాలా బిజీగా వున్న నృత్య దర్శకులలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఇటు యువ కథానాయకులకు .. అటు సీనియర్ హీరోల సినిమాలకి ఆయన నృత్య దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. ఆయన నృత్య దర్శకత్వం వహించిన కొన్ని డాన్సులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం .. చిరంజీవి గారి 'ఖైదీ' సినిమాలో ఆయన డాన్స్ చూసిన దగ్గర నుంచి డాన్స్ అంటే మరింత ఇష్టం పెరిగింది. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే డాన్స్ లో మెలకువలు తెలుసుకుని హైదరాబాద్ వచ్చేశాను. చిరంజీవిగారిని దగ్గర నుంచి చూస్తానా? లేదా? అనుకున్నాను. అలాంటిది ఆయన 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి రెండు పాటలకి నృత్య దర్శకత్వం వహించాను. వినాయక్ గారు .. చరణ్ గారు కలిసి ఈ ఛాన్స్ నాకు ఇచ్చారు. అందుకు నేను వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 
sekhar master

More Telugu News