India: భారత యుద్ధ విమానాలు వచ్చిన మాట నిజమే... తరిమితరిమి కొట్టాం: పాకిస్థాన్ ప్రగల్భాలు

  • బాంబు దాడులు జరగలేదు
  • ఉగ్రవాద శిబిరాలేమీ లేవు
  • వెల్లడించిన పాకిస్థాన్

మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన తన యుద్ధ విమానాలతో జరిపిన బాంబు దాడులపై పాకిస్థాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ, రక్షణ శాఖలు ఓ ప్రకటన విడుదల చేస్తూ, భారత విమానాలు నిబంధనలను ఉల్లంఘించి తమ సరిహద్దుల్లోకి వచ్చిన మాట వాస్తవమేనని, వాటిని వెంటనే తమ రక్షకదళాలు తిప్పికొట్టాయని ప్రకటించింది. భారత విమానాలు తమ భూభాగంపై బాంబు దాడులు చేయలేదని తెలిపింది. తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని, భారత ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని వెల్లడించింది. కాగా, నేడు భారత్ పుల్వామా దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News