Python: మహిళ షూలో దూరి విమానంలో 15 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పాము!

  • ఆస్ట్రేలియా నుంచి స్కాట్లాండ్ వరకు ప్రయాణించిన పాము
  • తొలుత బొమ్మ పాము అని పొరబడిన మహిళ
  • బతికి ఉండడంతో ప్రయాణికుల బెంబేలు

మహిళ షూలో దూరిన పాము ఏకంగా 15 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విహార యాత్ర కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మెయిరా బోక్సల్ తిరిగి స్కాంట్లాండ్ చేరుకుంది. 15 వేల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం గమ్యస్థానికి చేరుకున్న ఆమె తన లగేజీని సర్దుకుని షూ వేసుకుంటుండగా కాలికి ఏదో మెత్తగా తగిలింది. దీంతో ఉలిక్కిపడిన ఆమె కాలును తీసి షూను పరీక్షించగా అందులో చుట్టుకుని ఉన్న పాము లాంటిది కనిపించింది.

ఎవరో ప్రాంక్ కోసం బొమ్మ పామును పెట్టి ఉంటారని భావించింది. అయితే, అది కదలడంతో అక్కడనున్న అందరికీ ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అధికారులకు సమాచారం అందించడంతో దానిని పట్టుకున్నారు. ఆ పాము విషపూరితం కాదని, కొండచిలువ జాతికి చెందినదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మకాయ్ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించిన ఈ కొండచిలువను సాధారణంగా పెంచుకుంటూ ఉంటారని అధికారులు తెలిపారు.

More Telugu News