రెచ్చిపోయిన ఫ్యాన్స్.. నటుడు నవాజుద్దీన్‌ను దగ్గరకు లాగి మరీ సెల్ఫీ

  • కాన్పూరులో షూటింగ్‌లో ఉన్న నవాజుద్దీన్
  • పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులు
  • సెల్ఫీల కోసం దాడి చేసినంత పనిచేసిన వైనం

మితిమీరిన అభిమానానికి ఇది పరాకాష్ట. షూటింగ్‌లో ఉన్న అభిమాన నటుడితో సెల్ఫీలు దిగేందుకు అతడిపై దాడిచేసినంత పనిచేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఈ  చేదు అనుభవం ఎదురైంది. ‘రాత్ అకేలీ హై’ సినిమా షూటింగ్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు వెళ్లిన నవాజుద్దీన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. అంతటితో ఆగక అతడితో సెల్ఫీలు దిగేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో కొంచెం అతి చేసిన అభిమానులు నవాజుద్దీన్‌ను మెడపట్టుకుని లాగి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.  దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన బాడీగార్డులు అభిమానులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News