Pranay: బాబుకి నామకరణం చేసిన అమృత.. అభినందనలు చెబుతున్న నెటిజన్లు

  • గత నెల 30న జన్మించిన కుమారుడు
  • బాబుకు నిహాన్ ప్రణయ్‌గా నామకరణం
  • ప్రణయే తన కడుపున పుట్టాడని ఆనందం

ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. గత నెల 30న ప్రణయ్ భార్య అమృతకు కుమారుడు జన్మించాడు. తాజాగా ఆ చిన్నారికి నామకరణ మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బాబు జన్మించిన అనంతరం తన కడుపున తిరిగి ప్రణయే జన్మించాడని ఆనందపడుతున్న అమృత.. అతని పేరు కలిసొచ్చేలా ‘నిహాన్ ప్రణయ్’ అని తన కుమారుడికి నామకరణం చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోను చూసిన నెటిజన్లు అభినందనలతో పాటు నిహాన్‌ను ఆశీర్వదిస్తున్నారు.

  • Loading...

More Telugu News