Pawan Kalyan: నా మనసుకు మాత్రం కర్నూలే రాజధాని!: పవన్ కల్యాణ్

  • కర్నూలును అమరావతిని మించిన నగరంలా తీర్చిదిద్దుతా
  • రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తా
  • అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్రమంతా పర్యటిస్తే ప్రయోజనం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయినా... తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలులో విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ నుంచి ఎందరో రాజకీయ నాయకులు వచ్చినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తానని... కర్నూలును అమరావతికి మించిన నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

ఓట్లు అడగడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని... సమాజంలో మార్పు కోసమే వచ్చానని పవన్ చెప్పారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ ప్రజాసమస్యలను పట్టించుకోవాలని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్రమంతా పర్యటిస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. యువతలో ప్రశ్నించే ధైర్యం రావాలని చెప్పారు.
Pawan Kalyan
jagan
janasena
ysrcp
kurnool

More Telugu News