puri: 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్'

  • రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'
  • కొంతవరకూ చిత్రీకరణ పూర్తి
  •  సీక్వెల్ కి టైటిల్ ఖరారు

ప్రస్తుతం పూరి దర్శకత్వంలో .. ఆయన బ్యానర్ పై రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందుతోంది. చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే .. పూరి - చార్మీ కలిసి 'డబుల్ ఇస్మార్ట్ ' టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా వాళ్లు ఈ సినిమా రూపొందించనున్నారు. చార్మీ నిర్మాతగా .. పూరి దర్శకుడిగా ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. అయితే రామ్ తో చేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయితేనే దానికి సీక్వెల్ ఉంటుందనీ, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఇలా 'డబుల్ ఇస్మార్ట్' టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటారని చెప్పుకుంటున్నారు. సక్సెస్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తోన్న రామ్ కీ .. పూరికి ఈ సినిమా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News