trivikram: బన్నీ సినిమా విషయంలో జాగ్రత్తపడిన త్రివిక్రమ్

  • త్రివిక్రమ్ తదుపరి సినిమా బన్నీతో
  • వినోదభరితంగా సాగే కథ
  • త్వరలోనే సెట్స్ పైకి

త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో వుండనుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ ఓకే అనిపించుకున్న త్రివిక్రమ్, మిగతా పనులతో బిజీగా వున్నాడు. ఈ సినిమా విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా చేశాడు. ఈ సినిమా చూసినవాళ్లలో కొందరు .. ఇది త్రివిక్రమ్ సినిమా మాదిరిగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆయన సినిమాల్లో సహజంగా వుండే పంచ్ డైలాగ్స్ లేకపోవడం వలన .. కామెడీకి ప్రాధాన్యత లేకపోవడం వలన 'అరవింద సమేత' సినిమా విషయంలో ఆ విమర్శ వినిపించింది. అందుకనే బన్నీ సినిమాకి సంబంధించిన కథ విషయంలో ఆయన ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకున్నాడట. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగేలా స్క్రీన్ ప్లే ను సెట్ చేశాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి బన్నీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితోనే త్రివిక్రమ్ వున్నాడనిపిస్తోంది.

  • Loading...

More Telugu News