Andhra Pradesh: చెవిరెడ్డి ఆరోగ్యం బాగా లేదని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

  • చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు
  • పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు
  • దళితులను దూషించిన చింతమనేనిపై చర్యలు తీసుకోరే?

ఓటర్ల సర్వే పేరుతో వచ్చిన యువకులు తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను సేకరించి, జాబితా నుంచి తొలగించే యత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపిస్తూ గత అర్ధరాత్రి ధర్నాకు దిగారు. దీంతో చెవిరెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి, సత్యవీడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ ఘటనపై వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందిస్తూ, చెవిరెడ్డిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, అక్రమంగా అరెస్ట్ చేసి పీఎస్ లకు తిప్పుతూ చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. చెవిరెడ్డి ఆరోగ్యం బాగా లేదని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, దళితులను దూషించిన చింతమనేనిపై చర్యలు తీసుకోకుండా, చింతమనేని వీడియోను షేర్ చేశారని చెప్పి వైసీపీ వారిని అరెస్ట్ చేశారని విమర్శించారు. పోలీసులు నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News