raghuveerareddy: కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు!: రఘువీరారెడ్డి

  • ప్రకాశం జిల్లాలో ప్రత్యేకహోదా భరోసా యాత్ర
  • రాష్ట్రంలోని దళితులు, మైనార్టీలు అభద్రతతో ఉన్నారు
  • కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పూర్తి అభద్రతాభావంతో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.  ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రత్యేక హోదా భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులు, మైనార్టీల హక్కులు పూర్తిగా అణచి వేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందని, బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీల్లో సామాజిక స్పృహలేదని, ఈ రెండు పార్టీల్లో బలహీన వర్గాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని తెలిపారు. బీజేపీ బలహీన వర్గాలపై కక్షకట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీతో కలిసినడిచినందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా నడవాలని ఏమీ లేదన్నారు.
raghuveerareddy
Prakasam District
bharosa yatra

More Telugu News