దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్..ముగ్గురు ఉగ్రవాదుల హతం!
- తురిగాం ప్రాంతంలో సంఘటన
- ‘జైషే మహ్మద్’కు చెందిన వారిగా సమాచారం
- డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ మృతి
తురిగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ ఆమన్ కుమార్ మరణించారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. అమన్ కుమార్ గత రెండేళ్లుగా కుల్గాంలో పని చేస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు ‘జైషే మహ్మద్’కు చెందినట్టు తెలుస్తోంది.