Telugudesam: టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించి రౌడీయిజం చేస్తున్నారు: సీపీఎం నేత మధు

  • ఏపీ ప్రభుత్వంపై మధు ఆగ్రహం
  • రాష్ట్రంలో పాలన సరిగా లేదనడానికి ఇదే నిదర్శనం
  • ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు కొత్త పథకాలు
ఏపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి నిదర్శనం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలేనని అన్నారు. నాలుగున్నరేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు కొత్త పథకాలు తెస్తున్నారని చంద్రబాబును విమర్శించారు.
Telugudesam
cpm
madhu
Andhra Pradesh
chintamaneni

More Telugu News