Andhra Pradesh: అదే స్ఫూర్తితో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నడుంకట్టారు: కిశోర్ చంద్రదేవ్

  • అభివృద్ధి కోసం చంద్రబాబు పరితపిస్తారు
  • నాడు హైదరాబాద్ ను ఆయన అభివృద్ధి చేశారు
  • టీడీపీలో చేరిన కేంద్రమాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్
టీడీపీతో పనిచేయడం తనకు కొత్తేమీ కాదని, నేషనల్ ఫ్రంట్ లో కలిసి పని చేశామని కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో ఆయన చేరారు. అనంతరం, మీడియాతో కిశోర్ చంద్రదేవ్ మాట్లాడుతూ, అభివృద్ధి కోసం చంద్రబాబు పరితపిస్తారని ప్రశంసించారు. నాడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన చంద్రబాబు నేడు అదే స్ఫూర్తితో ఏపీ అభివృద్ధికి నడుంకట్టారని అన్నారు. గిరిజనులకు జీవనోపాధి పోతుందని బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నానని, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన లైసెన్స్ లను పూర్తిగా రద్దు చేసిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంసించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
kishore

More Telugu News