heroin anjali: ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు... పెళ్లి చేసుకున్నా నటన కొనసాగుతుంది: అంజలి

  • తమిళంలో బిజీగా ఉన్న ఈ తెలుగు అమ్మడు
  • అక్కడి నటుడితో ప్రేమలో పడిందని వార్తలు
  • అటువంటిదేమీ లేదని స్పష్టీకరణ
త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానన్న వార్తలను సినీ హీరోయిన్‌ అంజలి ఖండించింది. ప్రస్తుతం తాను నటనతో బిజీగా ఉన్నానని, పెళ్లి ఆలోచన లేదని కొట్టిపారేసింది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా నటన కొనసాగిస్తానని స్పష్టం చేసింది. అచ్చమైన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం తమిళంలో పలు అవకాశాలతో బిజీగా ఉంది.

 ఇటీవల కాలంలో ఓ తమిళ నటుడితో ప్రేమలో పడిందని, అతన్ని పెళ్లాడబోతోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన అంజలి ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని కొట్టిపారేసింది. కాకపోతే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నటన మానేయాలని లేదంది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఎంతోమంది హీరోయిన్లు మళ్లీ నటించేందుకు వస్తున్నప్పుడు పెళ్లయిన తర్వాత తానెందుకు ఇంట్లో కూర్చోవాలని ఎదురు ప్రశ్నిస్తోంది.
heroin anjali
marriage news

More Telugu News