India: భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది: వివరించిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్

  • పాక్ ఒక బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుంది
  • రెండు దేశాల మధ్య అణు యుద్ధం రాదు
  • అవగాహన లేని వారే అలా మాట్లాడుతున్నారన్న ముషారఫ్ 

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య 2002 నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తాయని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. అయితే భారత్-పాక్ మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశాలు మాత్రం ఎంతమాత్రమూ లేవన్నారు. ఆ ప్రచారమంతా ఉత్తదేనన్నారు.

దుబాయ్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ముషారఫ్.. యుద్ధమంటూ వచ్చి భారత్‌పై పాక్ ఒక బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని, అప్పుడు పాక్ మళ్లీ 50 బాంబులు వేయాల్సి వస్తుందని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. అయితే, అణుయుద్ధం గురించి మాట్లాడేవారికి నిజానికి దానిపై ఏమాత్రం అవగాహన లేదని, రెండు దేశాల మధ్య అణు యుద్ధం వచ్చే అవకాశం లేదని చెప్పారు.  

ముఖ్యంగా గత దశాబ్దకాలంలో భారత్-పాక్ మధ్య శత్రుత్వం మరింత ఎక్కువైందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా తన దళాలను ఉపసంహరించిన తర్వాత భారత్-పాక్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని ముషారఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.  

More Telugu News