Jana sena: జనసేన ప్రచార రథాలపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు

  • గుంటూరు జిల్లా కేంద్రంలో ఘటన
  • తోట చంద్రశేఖర్ రథాలపై అల్లరి మూకల దాడి
  • స్థానికంగా కలకలం
జనసేన ప్రచార రథాలపై రాళ్ల దాడి జరిగింది. గుంటూరు జిల్లాలోని ఏటీ అగ్రహారంలో జనసేన ప్రచార రథాలను చూసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. రథాలపై రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురిచేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది. రాళ్ల దాడిలో ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Jana sena
Guntur District
vehicles
Andhra Pradesh
Stone pelting

More Telugu News