Chinnu Soren: జార్ఖండ్‌లో దారుణం.. సొంత కుటుంబ సభ్యులు ఐదుగురిని హతమార్చిన ఉన్మాది!

  • బాగా మద్యం సేవించిన చిన్నూ సోరెన్
  • తెల్లవారుజామున పదునైన ఆయుధంతో దాడి
  • సోరెన్ మానసిక స్థితి సరిగా లేదంటున్న స్థానికులు
ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి సొంత కుటుంబ సభ్యుల్నే పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన జార్ఖండ్‌లోని సరాయ్ కేలా జిల్లాలో జరిగింది. 40 ఏళ్ల చిన్నూ సోరెన్ నిన్న రాత్రి బాగా మద్యం సేవించి  పొరుగింట్లో నిద్రించాడు. ఏమైందో ఏమో కానీ తెల్లవారుజామున తన ఇంట్లోకి వెళ్లి కనపడిన వారందరిపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో తన సోదరుడు రబీ మాంఝీ(45)పై మొదట దాడి చేసిన సోరెన్.. అనంతరం సోదరుడి భార్య పార్వతి(30), వారి పిల్లలు జీతన్(15), సురేశ్(13). పరేశ్(11)లను దారుణంగా హత్యచేశాడు.

ఆ తరువాత తన మరో సోదరుడు, తల్లిపై కూడా దాడి చేసి ఇంటికి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సోరెన్‌ను అరెస్ట్ చేసి కేసు విచారణ ప్రారంభించారు. అయితే సోరెన్ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.
Chinnu Soren
Parvathi
Rabi Manji
Jeethan
suresh
Paresh

More Telugu News