Nara Lokesh: ముగ్గురు మోదీలకు కలలోనూ చంద్రబాబే గుర్తొస్తున్నారు: కేటీఆర్‌ వ్యాఖ్యలపై లోకేశ్ ధ్వజం

  • ఫెడరల్ ఫ్రంట్ అంటూ 420తో చేతులు కలిపారు
  • కేసీఆర్‌కు భంగపాటు తప్పదు
  • ముగ్గురూ ఏకమై కుట్రలు చేస్తున్నారు
ఏపీని అతలాకుతలం చేసేందుకే టీఆర్ఎస్ వస్తోందనే సంగతి కేటీఆర్ మాటల్లో తేలిపోయిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓడిపోతారంటూ.. నేడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ.. చివరకు 420 జగన్‌తో జతకట్టి తెలంగాణకే పరిమితమయ్యారంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.

‘‘ఢిల్లీ మోదీ, తెలంగాణ మోదీ కేసీఆర్‌, ఏపీ మోదీ జగన్‌కు కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ.. చివరకు 420 జగన్‌తో జతకట్టి తెలంగాణకే పరిమితం అయ్యారు. టీడీపీ ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్‌కు భంగపాటు తప్పదు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక.. ముగ్గురు నాయకులు ఒక్కటై కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక జగన్‌తో చేతులు కలిపారు. ఏపీని అతలాకుతలం చేసేందుకు టీఆర్ఎస్ వస్తోందనే సంగతి కేటీఆర్‌ మాటల్లో తేలిపోయింది’’ అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Nara Lokesh
Narendra Modi
Jagan
KTR
KCR
Chandrababu

More Telugu News