CBI Officers: సీన్ రివర్స్: సీబీఐ అధికారులపై దాడి చేసిన నిందితుడి కుటుంబ సభ్యులు

  • అవినీతి కేసుల్లో నిందితుడిగా సునీల్ దత్
  • ఫామ్‌హౌస్‌కు వెళ్లిన సీబీఐ అధికారులు
  • దాడికి పాల్పడిన దత్ కుటుంబ సభ్యులు

సీబీఐ అధికారులు వస్తున్నారంటే పెద్ద పెద్ద నేతలకే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ నిందితుడి కుటుంబీకులు మాత్రం సీబీఐ అధికారులకే వెన్నులో వణుకు పుట్టించారు. దాంతో భయపడిపోయిన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అధికారులకు రక్షణగా నిలిచారు. నోయిడాకు చెందిన సునీల్ దత్ పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

సునీల్ నోయిడాలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడని తెలుసుకున్న సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లగా.. సునీల్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో నిందితుడిని చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించారు. దీంతో భయపడిపోయిన సీబీఐ అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి అధికారులకు రక్షణ కల్పించారు. సునీల్ కుటుంబ సభ్యుల దాడిలో గాయపడిన అధికారులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News