Baddam Bal Reddy: కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి మృతి

  • కొన్ని రోజులుగా కేర్‌లో చికిత్స
  • నేడు విషమించిన ఆరోగ్యం
  • వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి నేటి సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నేడు ఆయన ఆరోగ్యం విషమించడంతో నే సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌కు చెందిన బాల్‌రెడ్డి.. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985 నుంచి వరుసగా మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రముఖ నేతలంతా కేర్ ఆసుపత్రికి చేరుకుని బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. ఆయన అంత్యక్రియలు రేపు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Baddam Bal Reddy
Karvan Assembly
Hyderabad
Care Hospital

More Telugu News