Sushma Swaraj: సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం.. ఓఐసీ సమావేశానికి గౌరవ అతిథిగా ఆహ్వానం

  • ఓఐసి నుంచి భారత విదేశాంగ మంత్రికి ఆహ్వానం తొలిసారి
  • ఆరంభ సమావేశంలో ప్రసంగించాలని కోరిన ఓఐసీ
  • ఓఐసీ సమావేశానికి ఆహ్వానం పట్ల హర్షం

భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని సుష్మను కోరింది. ఒక భారత విదేశాంగ మంత్రికి ఓఐసీ నుంచి ఆహ్వానం అందటం చరిత్రలో ఇదే మొదటి సారి కావటం విశేషం.

సుష్మను ఓఐసీ ఆరంభ సమావేశంలో ప్రసంగించాలని యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జావేద్ అల్ నహ్యాన్ కోరినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ నేడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆహ్వానం ద్వారా యూఏఈతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అంతర్జాతీయంగా ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతుందని వ్యాఖ్యానించింది. 18.5 కోట్ల ముస్లిం జనాభా ఉన్న భారత్‌ను ఓఐసీ సమావేశానికి ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.

More Telugu News