raithu bandhu: కౌలు రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదు: కేసీఆర్

  • రైతుబంధుకు కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోము
  • రైతు రుణమాఫీ చెక్కులను నేరుగా అందించే ఆలోచనలో ఉన్నాం
  • అవగాహన లేకుండా విపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారు

రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకానికి కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండా... రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పారు. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులను అందజేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రైతులపై వడ్డీ భారం పడకుండా... వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులను అందిస్తామని అన్నారు. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పు చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వంపై విపక్ష సభ్యులు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని, ఇది సరైంది కాదని కేసీఆర్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలనే మళ్లీ చెబుతున్నారని... కొత్త విషయాలను మాట్లాడాలని, మంచి సలహాలను ఇవ్వాలని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లకు పైగా పోతున్నాయని... కానీ, అక్కడి నుంచి కేవలం రూ. 24 వేల కోట్ల దాకా మాత్రమే వస్తున్నాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News