rahul ramakrishna: 'మిఠాయి'తో మిగిలిన చేదు అనుభవం!

  • నిన్ననే థియేటర్స్ కి వచ్చిన 'మిఠాయి'
  • తొలి రోజునే నెగెటివ్ టాక్ 
  • ట్విట్టర్ నుంచి వైదొలగిన రాహుల్ రామకృష్ణ  
రాహుల్ రామకృష్ణ .. ప్రియదర్శి ప్రధానమైన పాత్రలను పోషించిన 'మిఠాయి' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమెడియన్స్ గా రాహుల్ రామకృష్ణకు .. ప్రియదర్శికి మంచి క్రేజ్ వుంది. దాంతో సహజంగానే 'మిఠాయి' పట్ల ఆసక్తిని చూపించారు. అయితే తొలి రోజునే ఈ సినిమా రుచిలేని మిఠాయి అనిపించుకుంది.

ఈ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో, అభిమానులకు క్షమాపణలు చెబుతూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశాడు. చివరి నిమిషం వరకూ ఈ సినిమాను రిపేరు చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని చెప్పాడు. మరో కథతో ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. ఆయన ఇంతగా వివరణ ఇచ్చినా, ట్విట్టర్లో భయంకరమైన కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ ను భరించలేక ఆయన ట్విట్టర్ నుంచి వైదొలిగాడు.
rahul ramakrishna
priyadarshi

More Telugu News