velama corporation: ఏపీ వెలమ కార్పొరేషన్‌ నుంచి ఇద్దరు సభ్యుల ఔట్‌...ఇద్దరు ఇన్‌

  • స్వల్ప మార్పులు చేపట్టిన ఏపీ ప్రభుత్వం
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సభ్యుల మార్పు
  • తాజా జీఓ జారీ చేసిన సర్కారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొప్పుల వెలమ, పోలినాటి వెలమల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్‌ సభ్యుల్లో ఇద్దరిని తొలగిస్తూ, కొత్తగా మరో ఇద్దరికి చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కారణాలు తెలియకున్నా శ్రీకాకుళం జిల్లాకు చెందిన యాళ్ల నాగేశ్వరరావును తొలగించి ఆయన స్థానాన్ని సింతు సుధాకర్‌తో భర్తీ చేసింది.

అలాగే, విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి భారతిని తొలగించి జి.ఎస్‌.నాయుడుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం జీఓ నంబరు 3ను ప్రత్యేకంగా జారీచేసింది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యాళ్ల నాగేశ్వరరావు, రెడ్డి శ్రీనివాసరావు, గుమ్మడి భారతి, పల్లా ముత్యానాయుడు, అంకంరెడ్డి సతీష్‌కుమార్‌, చింత శ్రీనివాస్‌కు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ నెల 20న జీవో నంబరు 2ను జారీ చేసింది. తాజాగా ఇద్దరికి ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు కల్పించింది.

More Telugu News