bengaluru: బెంగళూరు కరాచీ బేకరీ వద్ద నిరసనలు.. కరాచీ పేరును ఫ్లెక్సీతో మూసివేసిన యాజమాన్యం

  • పుల్వామా దాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు
  • కశ్మీరీలు లక్ష్యంగా బెంగళూరులో ఆందోళన
  • కరాచీ బేకరీ పాకిస్థాన్ ఔట్ లెట్ అన్న నిరసనకారులు
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ సంఘాలు బలంగా ఉండే కర్ణాటకలో కూడా ఆందోళనకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బెంగళూరులో కశ్మీర్ వాసులను లక్ష్యంగా చేసుకుని నిరసనలు జరిగాయి. దీంతోపాటు, నగరంలో ఉన్న కరాచీ బేకరీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో, భయాందోళనలకు గురైన బేకరీ యాజమాన్యం... కరాచీ అనే పేరును ఫ్లెక్సీతో మూసివేసింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ కరాచీ బేకరీ అనేది పాకిస్థాన్ ఔట్ లెట్ అని... అందుకే తాము నిరసన వ్యక్తం చేశామని చెప్పారు.

bengaluru
karachi bakery
protest
pulwama

More Telugu News