dy.speaker: దానికి మీరు ఓకే అయితే...దీనికి మేము కూడా ఓకే: కేటీఆర్‌కు ఉత్తమ్‌ షరతు

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం కోరిన పీసీసీ అధ్యక్షుడు
  • అలా అయితే డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు మద్దతిస్తామని స్పష్టీకరణ
  • సీఎంతో మాట్లాడి చెబుతానన్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు కేటీఆర్‌ చర్చకు రావడంతో ఉత్తమ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇస్తే స్పీకర్‌ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్‌ విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కేటీఆర్‌ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌లతో ఉదయం చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ మాట్లాడుతూ, తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ టీఆర్‌ఎస్‌ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు తగిన సంఖ్యా బలం ఉందని గతంలోనే ప్రకటించిన భట్టి అదే విషయాన్ని కేటీఆర్‌ వద్ద ప్రస్తావించారు.

ఈ సమయంలో ఉత్తమ్‌ జోక్యం చేసుకుని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి తమ నిర్ణయం తెలియజేస్తానని స్పష్టం చేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు స్థానాలకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, ఐదో స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానం కోసమే కాంగ్రెస్‌ కూడా పట్టుబడుతోంది.

More Telugu News