sharwanand: చందూ మొండేటికి ఛాన్స్ ఇచ్చిన శర్వానంద్

  • కథాకథనాలకి ప్రాధాన్యత 
  • కొత్తగా కనిపించే ప్రయత్నం
  •  '96' రీమేక్ తో సెట్స్ పైకి    
కథాకథనాల విషయంలో శర్వానంద్ చాలా శ్రద్ధ పెడతాడు. తెరపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. గతంలో ఫ్లాప్ ఇచ్చాడు గదా అని ఆయన ఆ దర్శకులు చెప్పే కథలు వినకపోవడం .. వాళ్ల సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపకపోవడం వంటివి చేయడు. అంతకుముందు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడైనా .. తనకి వినిపించిన కథ నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు.

అలా అంతకుముందు 'లై' సినిమాతో పరాజయాన్ని చవి చూసిన హను రాఘవపూడికి, 'పడి పడి లేచె మనసు'తో అవకాశం ఇచ్చాడు. అలాగే ఇటీవల 'సవ్యసాచి'తో ఫ్లాప్ ఇచ్చిన చందూ మొండేటికి కూడా తాజాగా ఓకే చెప్పేశాడు. ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయి .. కథను లాక్ చేసేయడం కూడా జరిగిపోయింది. '96' మూవీ రీమేక్ షూటింగ్ పూర్తయిన తరువాత, చందూ మొండేటితో కలిసి శర్వానంద్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
sharwanand
chandu mondeti

More Telugu News