Tollywood: సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్!
- హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
- లక్షల్లో నగదు, ఆభరణాలు మిస్సింగ్ అయ్యాయని కంప్లైంట్
- పనిమనిషిపై అనుమానం ఉందన్న మేనేజర్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్ బాబు మేనేజర్ ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల నగదుతో పాటు నగలు చోరికి గురయ్యాయనీ, తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు.